గ్రీన్ జోన్‌గా ఉన్న ప్రకాశం జిల్లా మార్టూరులో ఒక్కసారిగా కరోనా కేసులు నమోదు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఎస్ఆర్ రెసిడెన్సీ, ఎమ్మెస్నగర్, జనార్దన్ కాలనీల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. రోటరీ క్లబ్ సభ్యులు పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. కొవిడ్ వైరస్ నియంత్రణకు క్లబ్ తరఫున సహకారం అందిస్తామని రోటరీ అధ్యక్షుడు రావి అంకమ్మచౌదరి తెలిపారు.
మార్టూరులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ - మార్డూరులో రసాయన ద్రావణం పిచికారీ వార్తలు
ప్రకాశం జిల్లా మార్టూరులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కంటైన్మెంట్ జోన్లలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. పట్టణంలో వైరస్ నియంత్రణకు క్లబ్ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు.
మార్టూరులో రసాయన ద్రావణం పిచికారీ