ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గూడు లేని వారి కోసమే ఈ గోడ.... - వై.ఏ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల

ఎదుటి వ్యక్తికి సాయం చేయడంలోనే నిజమైన సంతోషం ఉందంటున్నారు ఆ విద్యార్థనీలు. చదువుతో పాటు సమాజం పట్ల అవగాహన... తోటి మనిషిని ఆదుకోవాలనే ఆలోచన మానవత్వానికి పునాదని బలంగా నమ్ముతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మహిళా కళాశాల విద్యార్థినీలు వినూత్న పద్ధతిలో మానవత్వాన్ని చాటుతున్నారు.

మానవత్వపు గోడ చీరాల

By

Published : Sep 18, 2019, 10:27 AM IST

Updated : Sep 18, 2019, 1:47 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలోని వై.ఏ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల అధ్యాపక బృందం అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మానవత్వపు గోడ అని ఒక నూతన ఆలోచనకు నాంది పలికింది. విద్యార్థునులకు అవసరం లేని దుస్తులు, వస్తువులు తీసుకొచ్చి అక్కడ ఉంచుతారు. వారం రోజుల తరువాత వచ్చి వాటిని అనాథలకు, నిరుపేదలకు పంచుతారు.

ప్రతిరోజు ఒక్కో విద్యార్థిని 2రూపాయలు ఒకడబ్బాలో వేసి నెలకోకసారి అనాథ శరణాలయాలకు ఇస్తుంటారు. ఈ చర్యతో విద్యార్థుల్లో దయ, కరుణ, సమాజం పట్ల అంకితభావం ఏర్పడతాయని కళాశాల ప్రధానాచార్యురాలు చెబుతున్నారు

మొక్కలు పెంచటం, వాటిని పంచటం, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రజలకు చెప్పటం కళాశాలలోని జాతీయసేవా విభాగం విద్యార్థునీల దినచర్య. విద్యతోపాటు సమాజానికి ఉపయోగపడే పనులు చేయటం తమకు సంతోషంగా ఉంటుదంటున్నరీ విద్యార్థులు. ఎదుటిమనిషి కన్నీళ్లు తుడవటానికి రక్తసంభంధమే అవసరంలేదని... గుండెలో పిడికెడు మానవత్వం ఉంటే చాలని నిరూపిస్తున్నారు చాటి చెబుతోందీ యువత.

గూడు లేని వారి కోసమే ఈ గోడ....

ఇదీ చూడండి

కోట్లల్లో వ్యాపారం... ప్రభుత్వానికి పన్ను ఎగనామం

Last Updated : Sep 18, 2019, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details