ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిద్దలూరులో 315 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ

గిద్దలూరులో స్థానిక ఎమ్మెల్యే రాంబాబు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తన చేతుల మీదుగా పేదలకు పట్టాలు అందించడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

house plots allotment
గిద్దలూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ

By

Published : Jan 9, 2021, 8:43 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలోని రాజానగర్​లో నిరుపేదలకు 315 ఇళ్ల పట్టాలను స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు పంపిణీ చేశారు. ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం తన పూర్వజన్మసుకృతమని.. ఇటువంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనడంతో తన జన్మ సార్థకమయ్యిందని ఆయన అన్నారు. త్వరలోనే అర్హులైన అందరికీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details