ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి కోసం ఎదురుచూపులు... బేల్దారీ కూలీల అవస్థలు - house manufacturing labours problems

ఓవైపు ఆంక్షలు, మరోవైపు ఇసుక కొరతతో బేల్దారి కూలీల జీవనం కష్టంగా మారింది. పనుల కోసం తెల్లవారుజాము నుంచీ వేచి చూడటం, అవి దొరక్క ఎవరైనా దాతలు ఆహారమందిస్తారేమోనన్న ఆకలి చూపులువీటితోనే రోజులు గడిపేస్తున్నారు.

house manufacturing labours problems with not work at ongole
ఉపాధి కోసం ఎదురుచూపులు... బేల్దారీ కూలీల అవస్థలు

By

Published : Jun 4, 2021, 7:37 PM IST

ఉపాధి కోసం ఎదురుచూపులు... బేల్దారీ కూలీల అవస్థలు

కరోనా ఆంక్షలు, నిర్మాణ పనుల మందగమనం వల్ల ఉపాధి లేక బేల్దారి కూలీలు పస్తులు ఉండాల్సి వస్తోంది. బేల్దారి, తవ్వకాలు, రవాణా పనులు చేసే వీరంతా ఒంగోలు ఫ్లై ఓవర్‌ కిందకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే చేరుకుంటారు. సాధారణంగా అవసరమున్నవారు ఇక్కడికి వచ్చి కూలీ మాట్లాడుకుని ముఠాలు తీసుకెళ్తారు. ఏడాది నుంచి పనులు నత్తనడకన నడుస్తుండటం వల్ల మధ్యాహ్నం వరకూ ఉపాధి కోసం ఎదురుచూసి నిరాశగా ఇంటిముఖం పడుతున్నారు.

ఇసుక కొరత వల్ల నిర్మాణాలు ఆగిపోయాయని.. కనీసం అన్న క్యాంటీన్‌ ఉండుంటే 5 రూపాయలకే పొట్ట నింపుకునే వాళ్లమని కూలీలంటున్నారు. అర్ధాకలితో నిద్రపోతున్నామని బేల్దారి మేస్త్రీలు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచదవండి.

జగన్.. టీకాల సరఫరాపై ప్రధానిని ఎందుకు ప్రశ్నించరు..? జైరామ్‌ రమేశ్‌

ABOUT THE AUTHOR

...view details