ప్రకాశం జిల్లా ఒంగోలులో 19వ బ్యాచ్‌కు చెందిన 398 మంది మహిళా పోలీసులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి మాట్లాడుతూ... పోలీసులకు ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్‌లు ప్రవేశపెడుతున్నామని వివరించారు. పోలీసులకు దేశంలోనే తొలిసారిగా వీక్లీ ఆఫ్ ప్రవేశపెట్టిన ఘనత వైకాపాకే దక్కుతుందని పేర్కొన్నారు. జీరో ఎఫ్ఐఆర్ విజయవంతంగా అమలవుతోందని చెప్పారు. మహిళా పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా మహిళా మిత్రను ఏర్పాటు చేశామని వివరించారు. ఇంటర్నెట్ ద్వారా మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు సైబర్ మిత్రను ఏర్పాటు చేయటం ద్వారా.. దేశంలోనే మన రాష్ట్ర పోలీసుల సేవలకు మంచి ప్రసంశలు లభిస్తున్నాయని సుచరిత చెప్పారు.
'కరోనా మహమ్మారిపై సమరంలో పోలీసుల పాత్ర కీలకం'
కరోనా మహమ్మారిపై సమరంలో పోలీసులు కీలకంగా పని చేస్తున్నారని...హోంమంత్రి సుచరిత కొనియాడారు. కొవిడ్ కారణంగా అమరులైన పోలీసులకు 50 లక్షల రూపాయలు బీమా కల్పించామని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా పోలీస్ పాసింగ్ పరేడ్‌లో హోంమంత్రి సుచరిత, మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, డీజీపీ గౌతం సవాంగ్ పాల్గొన్నారు.
హోంమంత్రి సుచరిత