ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో పొగాకు పరిశ్రమలో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తయారు చేస్తున్న గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దిల్లీకి చెందిన పరిశ్రమలో.. బెంగళూరు బ్లూబుల్ అనే పేరు గల ఉత్పత్తులను తయారుచేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాడుల్లో సుమారు 265 బస్తాల పొగాకు ఉత్పత్తులు, ప్రమాదకర రసాయనాలు లభ్యమయ్యాయి. పట్టుబడిన ముడిపదార్థాల విలువ సుమారు 3 కోట్ల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వివరించారు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన నెల్లూరువాసి బాలగాని ప్రసాద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కేసులో కీలక సమాచారం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ జిలానీని ఎస్పీ అభినందించారు. వీటిని స్థానికంగా తయారుచేసి రాష్ట్రంలోని జిల్లాలకు తరలిస్తున్నట్టు వివరించారు.
పోలీసుల దాడులు.. 3 కోట్ల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - medarametla
ప్రకాశం జిల్లాలో దిల్లీకి చెందిన ఓ పరిశ్రమలో పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 3 కోట్ల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల దాడులు