ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాల ఉన్నత ఫలితం.. ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం - govt school statf campagin for admission

రండి చేరండి...అనుభవం గల ఉపాధ్యాయ సిబ్బంది..అత్యున్నతమైన విద్యాబోధన మా సొంతం.. అని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను రా రమ్మంటున్నాయి. ఈ ఏడాది ఫలితాల్లో ప్రైవేట్ బడికి పోటీగా నిలబడ్డామంటూ ప్రకాశం జిల్లా పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారమెందుకు...?

By

Published : Jun 6, 2019, 10:40 PM IST

ప్రభుత్వ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారమెందుకు...?

మా పాఠాశాల ఫలితాలు చూడండి... ఈ ఏడాది మంచి ఉత్తీర్ణత సాధించాం. మీ పిల్లలు బంగారు భవిష్యత్తు మాతోనే సాధ్యం.. అంటూ ప్రచారం చేస్తున్నారు ఆ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలను వివరిస్తూ... ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను ఆకర్షిస్తున్నారు.

ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ ఏడాది పదో తరగతిలో మంచి ఫలితాలొచ్చాయి. ప్రైవేట్ పాఠశాలాలకు దీటైన విజయం సాధించాయి. అంతే దీన్నే ప్రచారాస్త్రంగా మార్చుకున్న ఆ బడి ఉపాధ్యుయులు... ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను చేర్చాలని కోరుతున్నారు. హోర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టి సౌకర్యాలు, విజయాలు వివరిస్తున్నారు. ఈ పూరుపాలెం ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఈ ఏడాది ఐదుగురు బాలికలకు పదో తరగతితిలో పది జీపీఏ సాధించి ఔరా అనిపించారు. మరో 20 మంది తొమ్మిది పాయింట్లతో మెరిశారు. దీన్నే తల్లిదండ్రులకు వివరిస్తూ ఆలోచన కలిగిస్తున్నారు.

తమ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ఉచిత పుస్తకాలు,యూనిఫామ్, ఫీజుల బాధే ఉండదని చెబుతున్నారు. బూట్ల సహా అన్ని ఉచితంగా ఇస్తున్నామని... మంచి భవిష్యత్‌ ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details