రహదారులపై నడిచి వెళుతున్న వలస కూలీలను సరిహద్దు దాటించేందుకు... రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై నడిచి వెళుతున్న కూలీలను అధికారులు అడ్డుకొని వారి వివరాలు సేకరించి, బస్సుల్లో పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు 30 మంది ఉంటే, వారికి ఒక బస్సును కేటాయించి సరిహద్దు వరకూ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు వలస కూలీలను గుర్తించి, వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. బస్సుల్లో తరలిస్తుండడంపై వలస కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు నుంచి పోలీసులను తప్పించుకొని, పొలాల వెంట పడి వచ్చామని ఆవేదన చెందారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తాము.. నడిచి వెళ్లక తప్పడంలేదని తెలిపారు.