ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలి - ongole

కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను వెంటనే కూల్చివేయాలని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు.

హేతువాదం

By

Published : Jun 30, 2019, 11:56 PM IST

అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలి

కృష్ణ న‌ది క‌ర‌క‌ట్ట పై అక్ర‌మంగా నిర్మించిన క‌ట్ట‌డాల‌ను వెంట‌నే కూల్చి వేయాల‌ని హేతువాద సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు నార్నె వెంక‌ట సుబ్బ‌య్య డిమాండ్ చేశారు . ప్ర‌కాశం జిల్లా ఒంగోలు ప్రెస్ క్ల‌బ్ లో మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడారు. ప్ర‌జావేదిక కూల్చ‌డానికి పంపిన జేసిబీలు వెనక్కి ర‌ప్పించ‌డ‌కుండా అక్ర‌మంగా నిర్మించిన మంతెన వారి ఆశ్ర‌మం, గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద ఆశ్ర‌మం, ఇస్కాన్ టెంపుల్, శివ‌క్షేత్రం వంటి నిర్మాణాల‌ను కూడా కూల్చివేయాల‌ని కోరారు. ప్ర‌కాశం జిల్లా గుడ్లూరు మండ‌లం చేవూరులో చెరువుని అక్ర‌మంగా నిర్మించి ప్ర‌జ‌ల‌ను బురిడీ కొట్టిస్తున్న రామ‌దూత ఆశ్ర‌మాన్ని కూడా ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాల‌న్నారు. అక్ర‌మ నిర్మాణాల‌ని కూల్చాల‌ని ముఖ్య‌మంత్రి చెప్తున్నా జిల్లాలోని అధికారులే రామ‌దూత వంటి దొంగ స్వాములకు అండ‌గా ఉంటున్నార‌ని విమ‌ర్మించారు.

ABOUT THE AUTHOR

...view details