ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: మంత్రి సురేష్

By

Published : Oct 17, 2020, 9:27 PM IST

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. మూడు కస్తూర్భా గాంధీ జూనియర్ కళాశాలకు శంకుస్థాపన చేశారు.

minister adimulapu suresh
minister adimulapu suresh

నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సకల సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దాడానికి ముఖ్యమంత్రి జగన్ చర్యలు చేపట్టారని విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ చెప్పారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శనివారం మంత్రి సుడిగాలి పర్యటన చేపట్టారు.

నియోజకవర్గంలోని త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల్లో కస్తూర్భా గాంధీ జూనియర్ కళాశాలల భవనాలకు శంకుస్థాపన చేశారు. సుమారు 5 కోట్ల రూపాయల నిధులతో వీటిని నిర్మించనున్నారు. అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్​లు పంపిణీ చేశారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దుతున్నాని చెప్పారు. పదో తరగతితో విద్యార్థినులు ఆగిపోకుండా ఇంటర్మీడియట్ వరకు చదువుకొనే విధంగా కస్తూర్భా గాంధీ కళాశాలలను అప్​గ్రేడ్ చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details