ప్రకాశంజిల్లా ఒంగోలులో గోపాలమిత్రలు 8 రోజు ఆందోళన చేప్టటారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలమిత్రలకు తోడుగా గోమాత నిరసనలో పాల్గొంది. అనంతరం గోమూత్రాన్ని తలపై చల్లుకుని.. తమ సమస్యలు నెరవేరాలని ప్రార్ధించారు. ప్రజాసంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీమేరకు.. ఉద్యోగాలను వెంటనే క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేసారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళనలు విరమించమని హెచ్చరించారు.
గోమూత్రం చల్లుకొని నిరసన... ఎవరు చేశారంటే? - gopalamitras protests
ఉద్యోగ భద్రత కల్పించాలని ఒంగోలు లో గోపాలమిత్రలు 8 రోజు ధర్నాను కొనసాగించారు. వీరికి తోడుగా గోమాత నిరసనలో పాల్గొంది.
gopalamitras protests at front of ongole collecterate in prakasham district