దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలోని శ్రీ అంకమ్మతల్లి దేవాలయంలో ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ అర్చకులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజు శనివారం బాలాత్రిపురసుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారని దేవాలయ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
అంకమ్మతల్లి ఆలయంలో బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చిన దేవీ - prakasham district martoor
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలోని శ్రీ అంకమ్మతల్లి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శనివారం బాలా త్రిపురసుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
అంకమ్మతల్లి ఆలయంలో బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చిన దేవీ