గిద్దలూరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుశీల ఆత్యహత్య - Giddaluru Revenue Inspector commits suicide
09:32 August 11
గిద్దలూరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుశీల ఆత్యహత్య
ప్రకాశం జిల్లా గిద్దలూరులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న సుశీల ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో సూపర్ వాస్మోల్-30 ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న సోమవారం తన భర్త నారాయణ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాలతో దంపతులిద్దరూ ఒకరితరువాత మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
TAGGED:
news in prakasam district