కారంచేడులో వైభవంగా శిరిమహోత్సవం - sidi mahotsavam
ప్రకాశం జిల్లా కారంచేడులో గంగమ్మతల్లి శిరి మహోత్సవం వైభవంగా జరిగింది.తిరుణాళ్లు సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ విద్యుత్ ప్రభలు, సాంసృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
ప్రకాశం జిల్లా కారంచేడులో గంగమ్మతల్లి శిరి మహోత్సవం వైభవంగా జరిగింది. గత 34 ఏళ్లుగా ప్రతి ఏడాది అమ్మవారి తరుణాళ్లను ఘనంగా నిర్వహిస్తున్నారు. శిరి పెళ్ళికొడుకుతో ఊరేగింపుగా అమ్మవారిగుడికి వెళ్ళి గుడివద్ద ఉండే శిరిమాను పెట్టెలో మేకపోతును ఉంచి గుడిచుట్టు మూడు ప్రదక్షిణాలు చేయిస్తారు. ఈ సమయంలో శిరిమాను చెక్క పెట్టెలో ఉంచిన మేకపోతును భక్తులు జీడికాయలు, కొబ్బరి చిప్పలతో కొట్టడం ఆచారంగా వస్తోంది. ఈ మహోత్సవానికి కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు, చీరాల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. తిరుణాళ్లు సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ విద్యుత్ ప్రభలు, సాంసృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి