సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం బస్‌స్టేషన్ ప్రాంగణమంతా ప్రయాణికులతో రద్దీగా మారింది. వీరంతా తెలంగాణా, బెంగళూరు, తమిళనాడు రాష్ట్రాల్లో జీవనోపాధి పొందుతున్నారు. సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్నా..ఓటు వేయాలనే ఉద్దేశంతో తమ గ్రామాలకు పయనమయ్యారు.
దేశ భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా పయనిస్తాం..
ఎన్నికల నేపథ్యంలో సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ తరుణంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారిపోయాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రయాణికులతో కిటకిటలాడుతుంది.
దేశ భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా పయనిస్తాం..
ఇవీ చదవండి..ఓటేద్దాం రండి...