ఆగివున్న లారీని మినీ ట్రాలీ ఢీ కొట్టింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హసనాపురం దగ్గర జరిగింది. గాయాలపాలైన వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వారిని కర్నూలుకు తరలించారు.
ACCIDENT: ఆగివున్న లారీని ఢీ కొట్టిన మినీ ట్రాలీ.. ఐదుగురికి గాయాలు - రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని మినీ ట్రాలీ ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదం
వీరందరూ కొమరోలు మండలం పొట్టిపల్లె గ్రామానికి చెందినవారు. పొట్టిపల్లి గ్రామం నుంచి బేస్తవారిపేట మండలం గంటాపురంలో పెళ్లికి వెళ్తుండగా దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి:లారీని ఢీ కొట్టిన బస్సు... ముగ్గురు ఏపీ వాసులు మృతి