ప్రకాశం జిల్లా చీరాలలో మత్స్యకారులు ఉదయం నుంచి ధర్నా నిర్వహిస్తున్నారు. తమపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ చీరాలలోని 219 జాతీయ రహదారిపై మత్స్యకారులు బైఠాయించారు. అధికారుల నుంచి స్పందన రాకపోవటంతో వందలాది మంది మత్స్యకారులు చీరాల గడియార స్తంభం కూడలికి చేరుకుని ధర్నా చేపట్టారు. తమ ఇళ్లపై దాడి జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు.
చీరాల గడియార స్తంభం కూడలిలో మత్స్యకారుల నిరసన - ప్రకాశంలో మత్స్యకారుల నిరసన వార్తలు
మత్స్యకారుల మధ్య వివాదం ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం కూడలిలో ఉద్రిక్తతకు దారితీసింది. కటారిపాలెంకు చెందిన కొంతమంది తమపై దాడి చేశారని, న్యాయం చేయాలంటూ చీరాలకు చెందిన మత్స్యకారులు ఉదయం నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పరామర్శించారు.
చీరాల గడియార స్తంభం కూడలిలో మత్స్యకారుల నిరసన
పోలీసులు, మత్స్యశాఖ అధికారులు... ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరుపుతున్నారు. ఈపురుపాలెం ఎస్ఐ, చీరాల రూరల్ సీఐలను సస్పెండ్ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పరామర్శించారు.
ఇదీ చదవండి: