ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేపల వేటకు వెళ్లి.. వలలో చిక్కుకుని వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరకొండలో జరిగింది. వలను లాగే క్రమంలో అదుపు తప్పి చెరువులో పడగా.. అది మెడకు చుట్టుకుని.. ఆ వ్యక్తి మరణించాడు.

fishermen died in prakasham
fishermen died in prakasham

By

Published : May 1, 2021, 6:22 PM IST

ప్రకాశం జిల్లా సింగరకొండలో విషాదం జరిగింది. చేపల వేటకు వెళ్లి వీరాంజనేయులు అనే వ్యక్తి మృతి చెందాడు. గోపాలపురానికి చెందిన చెలంచర్ల వీరంజనేయులు చేపలు పడుతూ జీవనం సాగించేవాడు. సింగరకొండ భువనాసి చెరువులో వేటకు వెళ్లాడు.

వలను లాగే క్రమంలో అదుపు తప్పి చెరువులో పడిపోయాడు. ఆ వల అతని మెడకు చుట్టుకుంది. కాసేపటికి కొందరు జాల్లరు వచ్చి చూడగా.. విగత జీవిగా వలకు చిక్కి ఉన్నాడు. బయటకు తీసి మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details