ప్రకాశం జిల్లా కనిగిరిలోని పునుగోడుకు వెళ్లే రహదారిలో.. ఓ ద్విచక్రవాహనం నుంచి మంటలు చెలరేగాయి. పునుగోడు గ్రామానికి వెళ్లే రహదారి ఉన్న చంద్రమౌళి గ్రానైట్ క్వారీ సమీపంలో.. ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడు కనిగిరి నుంచి గ్రానైట్ క్వారీ దగ్గరకు వెళుతుండగా వాహనం నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రావడంతో.. వాహనదారుడు అప్రమత్తమై పక్కకు దూకాడు. ఘటనలో ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమవ్వగా.. వాహనదారుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వాహనానికి ఉన్న బ్యాటరీ విద్యుత్ వైర్ల వల్ల.. షాక్ సర్క్యూట్ వచ్చి ఉంటుందని.. వాహనదారుడు, స్థానికులు భావిస్తున్నాడు.
ద్విచక్ర వాహనం నుంచి అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
ప్రకాశం జిల్లా కనిగిరిలోని పునుగోడుకు వెళ్లే రహదారిలో.. ఓ ద్విచక్రవాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాహనం నుంచి మంటలు చెలరేగటంతో.. అప్రమత్తమైన వాహనదారుడు, వెంటనే కిందకు దూకగా.. పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనలో ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమైంది.
ద్విచక్ర వాహనం నుంచి అకస్మాత్తుగా చెలరేగిన మంటలు