ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో 10 ఎకరాల వరి గడ్డి వాముకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. గ్రామానికి చెందిన యోగయ్యకు చెందిన ఆరు ఎకరాల వరి గడ్డి వాము, రెండు ఎకరాల కంది కట్ట, శివకు చెందిన నాలుగు ఎకరాల వరి గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 70 వేల రూపాయల నష్టం వాటిల్లుతుందని బాధితులు తెలిపారు.
వరిగడ్డి వాముకు నిప్పంటించిన దుండగులు - prakasam dst fire news
ఆకతాయిలు చేసిన పనికి ప్రకాశం జిల్లాలో ఇద్దరు రైతులకు 70 వేల నష్టం వాటిల్లింది. 10 ఎకరాల వరిగడ్డి వాముకు గుర్తుతెలియనివ్యక్తులు నిప్పంటించి వెళ్లిపోయారు. ఈ ఘటనలో వరిగడ్డి మొత్తం పూర్తిగా కాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
fire accidnet in prakasam dst santhanoothaloor mandal