FIRE ACCIDENT ON NATIONAL HIGHWAY: ఒకే రోజు రెండు ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు జరగడం వాహన దారులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం ఆదివారం జాతీయ రహదారిపై జరిగింది. రెండు లారీలు అగ్ని ప్రమాదానికి దగ్ధం అయ్యాయి. కేవలం పది కిలో మీటర్ల దూరంలో, రెండు గంటల కాల వ్యవధిలో జరగడం ఆందోళనకు గురి చేసింది. అందులో ఉన్న లారీ డ్రైవర్లు భయానికి గురి అవుతున్నారు. అగ్ని మాపక శకటం సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. కొద్దిసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లారీ డ్రైవర్లు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటనలు ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్నాయి.
అధిక లోడు.. షార్ట్ సర్క్యూట్: జాతీయ రహదారిపై ఓ టిప్పర్ లారీ దగ్ధమైంది. ఆదివారం టంగుటూరు టోల్ ప్లాజా చెరువులో చీమకుర్తి నుంచి నెల్లూరు జిల్లా రామయ్య పట్నం కోర్టుకు రవాణా చేస్తున్న బండ రాళ్ల లారీ అగ్నికి ఆహుతి అయింది. అధిక లోడు కారణంగా లారీ షార్ట్ సర్క్యూట్ అయినట్లు తెలుస్తుంది. టోల్ ప్లాజా సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో సిబ్బంది, వాహన చోదకులు భయ భ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక శకటం వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. డ్రైవర్ కాసిం సురక్షితంగా బయట పడ్డారు. ఈ అగ్ని ప్రమాదం జరిగిన రెండు గంటన కాల వ్యవధిలో మరో ప్రమాదం జరిగింది.