Crimes and Accidents: ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బార్లకుంట గ్రామంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బిల్లా వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందిన పూరిగుడిసెలో సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్రిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునే లోపే మంటలు దావాలంగా వ్యాపించి గుడిసె మొత్తం కాలిపోయింది. వెంకటేశ్వర్లు తన కూతురి పెళ్లి కోసం అప్పు చేసి మరీ ఇటీవల 10 తులాల బంగారం, లక్షన్నర నగదు తీసుకువచ్చి తన ఇంట్లోని బీరువాలో పెట్టాడు. ఈ అగ్నిప్రమాదంలో ఏర్పడిన మంటల్లో ఆ బంగారం, నగదు మొత్తం దగ్ధమైపోయాయి. పది రోజుల్లో జరగాల్సిన పెళ్లికి తెచ్చుకున్న బంగారం, నగదు దగ్ధమైపోవటంతో బాధితుడు వెంకటేశ్వర్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
RAILWAY BOGI FIRE: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
కుమార్తెకు ముద్దు పెట్టిందని.. బాలికను కట్టేసి ఒంటినిండా వాతలు..: మరోవైపు జిల్లాలోని గిద్దలూరు మండలంలో దారుణమైన ఘటన జరిగింది. తన ఐదేళ్ల కుమార్తెకు ముద్దు పెట్టిందని ఓ బాలిక(11)ను కట్టేసి ఒంటినిండా వాతలు పెట్టిందో మహిళ. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో క్రిష్టం శెట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రణీత అనే బాలిక తమ ఇంటికి సమీపంలో ఉన్న మౌనిక అనే వివాహిత ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఆ సమయంలో ఐదేళ్ల పాపను చూసిన బాలిక.. ఆమెకు ముద్దుపెట్టింది. ఇది గమనించిన చిన్నారి తల్లి మౌనిక.. కోపోద్రిక్తురాలై బాలికను కట్టేసి మరీ ఒంటినిండా వాతలు పెట్టింది. ఈ ఘటన జరిగిన సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. బాలిక కేకలు వేయటంతో ఇరుగుపొరుగువారు వచ్చి బాలికను విడిపించారు. అనంతరం బాలికను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.
Father Killed His Son: భార్యపై అనుమానంతో కుమారుడి దారుణ హత్య.. అప్పు తీర్చమన్నందుకు తల్లీకుమారులపై దాడి
భార్యను కత్తితో పొడిచిన భర్త.. :కర్నూలు జిల్లాలో కుటుంబ కలహాలతో భార్యను కత్తితో కడుపులో పొడిచాడో భర్త. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు ఆమెను చికిత్స మేరకు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కడుపులో కత్తి అలాగే ఉన్న క్లిష్టమైన పరిస్థితిలో వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిపై గాలింపు చర్యలు చేపట్టారు.
Accidents: సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 12మందికి గాయాలు.. మరోవైపు స్కూల్ బస్సు బోల్తా..
ఇసుక కోసం తీసిన గోతిలో పడి.. మాజీ సర్పంచ్ మృతిబాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో.. ఆ గ్రామ మాజీ సర్పంచ్ మృతి చెందారు. ఇసుక కోసం తీసిన 15అడుగుల గోతిలో ఆయన ట్రాక్టర్‌తో సహాపడిపోయారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. తిమ్మాయపాలెంనకు చెందిన వెంకటేశ్వర్లు(మాజీ సర్పంచ్) పొలం దుక్కి దున్నడం కోసం ట్రాక్టర్ తీసుకొని పొలానికి వెళ్లారు. పొలంలో పని ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో దారికి అనుకొని ఉన్న ఇసుక కోసం తీసిన గోతిలో ట్రాక్టర్‌తో పాటు పడిపోయాడు. ట్రాక్టర్15 అడుగుల లోతులో పడటంతో చక్రాల భాగం పైకి, స్టీరింగ్ భాగం కిందకి పడిపోయింది. ఈ ఘటనలో ట్రాక్టర్ కిందపడిన ఆయన మృతి చెందారు. చీకటి పడినా వెంకటేశ్వర్లు ఇంటికి రాలేదని వారి కుటుంబ సభ్యులు వేతికేందుకు పొలానికి వెళ్లగా.. జరిగి ప్రమాదాన్ని గమనించారు. వెంటనే ప్రొక్లైన్ సహాయంతో ట్రాక్టర్‌ను తొలగించి చూడగా.. వెంకటేశ్వర్లు విగతజీవుడై కన్పించాడు. కాగా ఇసుక కోసం గోతులు తీయటం కారణంగానే ఆయన మృతి చెందారని గ్రామస్థులు ఆరోపించారు. పొలాలకు వెళ్లే మార్గం వెంబడి ఇసుక కోసం ఇలా పెద్దపెద్ద గోతులు తీసి వేదిలేశారని, ఈ గోతుల వల్ల చాలా ప్రమాదాలు జరిగాయని అంటున్నారు.
స్నేహితులతో కలిసి భార్యపై వేధింపులు.. నిందితులు అరెస్ట్..పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో భార్యను మిత్రులతో కలిసి ఆమె భర్త వేధిస్తున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె భర్తతో పాటు అతడి ఇద్దరు మిత్రులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నరసాపురం పట్టణము అన్నపూర్ణ థియేటర్ ప్రాంతానికి చెందిన ఏసు అనే వ్యక్తి మద్యానికి బానిసగా మారి.. స్నేహితులతో కలిసి భార్య కళావతి(30)ని వేధింపులకు గురి చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఆమె భర్త ఏసు, అతడి ఇద్దరు స్నేహితులు.. పుచ్చకాయల నవీన్, దిడ్డ అబ్రహాంలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసయాదవ్ తెలిపారు.
Crimes: పుట్టింటికి వెళ్తానన్నందుకు భార్య హత్య.. తాళం వేసుకుని వెళ్తే.. ఇంట్లో సొమ్ము గోవిందా..