ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలి' - అమరావతి రైతుల నిరసనలు న్యూస్

అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రంగా భవన్​లో అమరావతి రైతులకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు.

farmers support to amaravathi agitation in ongole
farmers support to amaravathi agitation in ongole

By

Published : Sep 17, 2020, 3:30 PM IST

275 రోజులుగా అమరావతిలో రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని రైతు సంఘం నాయకులు అన్నారు. భూములిచ్చిన రైతులు న్యాయం కోరుతుంటే.. ముఖ్యమంత్రి పట్టనట్లు వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. రాజధానిని మూడుముక్కలు చేస్తూ మనిషికో రకంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details