అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య - ప్రకాశం జిల్లాలో రైతు ఆత్మహత్య
ప్రకాశం జిల్లా జే.పంగులూరు గ్రామంలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాచిన బుల్లిబాబు మూడేళ్లుగా తనకున్న వ్యవసాయ భూమితోపాటు మరికొంత కౌలుకు తీసుకొని శనగ పంట సాగు చేస్తున్నాడు. గతంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించలేదు. తెచ్చిన అప్పులకు పెరిగిన వడ్డీ తీర్చే దారి లేక... శీతల పానియంలో పురుగుమందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య