ప్రకాశం జిల్లా పొన్నులూరు మండలం పెరికిపాలెేనికి చెందిన కుంకు వెంకటేశ్వర్లు అనే రైతుకు నాలుగు ఎకరాల భూమి ఉంది. వ్యవసాయంలో లాభసాటిగా లేదని భావించిన వెంకటేశ్వర్లు.. ఉపాధి కోసం కర్ణాటక రాష్ట్రం బళ్లారి వెళ్లాడు. అక్కడ కొంత భూమి కౌలుకు తీసుకొని దానిమ్మతోట వేశాడు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. వాతావరణం అనుకూలించక పంట సరిగా రాలేదు. దీంతో వెంకటేశ్వర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు(suicide with Financial problems).
Farmer suicide in Prakasam District : ఫేస్‌బుక్ లైవ్‌లో.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య! - prakasam district latest news
అప్పుల బాధ తాళలేక ప్రకాశం జిల్లాలో ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య(Farmer suicide on Facebook Live) చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు అనే రైతు ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
అప్పులిచ్చిన వారు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గం తెలియకపోవడంతో.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో తన గోడును వెళ్లబోసుకొని పురుగులమందు తాగాడు. గమనించిన బంధువులు.. వెంకటేశ్వర్లును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.