ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మీర్జాపేట గ్రామానికి చెందిన గోలమారి తిరుపతిరెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే దీనికి రెవెన్యూ అధికారులే కారణమని బంధువులు ఆరోపించారు. గ్రామంలో తనకున్న 1.64 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన వేరొకరికి గత తహసీల్దార్ కట్టబెట్టారని తెలిపారు. ఈనెల 6న సదరు పొలాన్ని వేరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు. దీనిపై మనస్తాపం చెందిన రైతు పురుగుల మందు తాగినట్లు వివరించారు. తిరుపతిరెడ్డి మృతి విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారి.. వేరొకరి పేరు మీద ఉన్న సదరు పొలం వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించారు.
పురుగుల మందు తాగి రైతు బలవన్మరణం
ప్రకాశం జిల్లా మీర్జాపేటలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనికి కారణం రెవెన్యూ అధికారులేనంటూ బంధువులు ఆరోపించారు. రైతు భూమిని వేరొకరి పేరు మీద మార్చడం వల్లే మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు.
తమ పొలం వేరొకరికి కట్టబెట్టారని రైతు ఆత్మహత్య