ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పి.గుడిపాడు గ్రామానికి చెందిన అంజయ్య (62) రెండేళ్లుగా... కర్ణాటకలో పదెకరాల భూమి కౌలుకి తీసుకొని సాగుచేశాడు. పెట్టుబడి కోసం అప్పులు తెచ్చాడు. రూ.10 లక్షల వరకు గ్రామంలో అప్పులు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఇటీవలే కర్ణాటక నుంచి తన ఇంటికి రాగా... డబ్బులు ఇవ్వాలని అప్పు ఇచ్చినవారు ఒత్తిడి చేశారు. బంధువుల దగ్గరకు వెళ్లి నగదు తీసుకొస్తానని... చెప్పి ఊరు చివర చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
డబ్బు తీసుకొస్తానని వెళ్లి... ప్రాణం తీసుకున్నాడు
అప్పుల బాధకు రైతు బలైపోయాడు. రాష్ట్రంలో వర్షాలు ఆశించిన మేరకు కురవక వ్యవసాయానికి గడ్డు పరిస్థితి ఏర్పడింది. పొరుగు రాష్ట్రం వెళ్లి పంటసాగు చేసి అప్పులు తీరుద్దామని వెళ్లాడు. అక్కడా నిరాశే ఎదురైంది. చేసిన అప్పుకు వడ్డీ పెరిగింది తప్ప... దిగుబడి రాలేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక... ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య