ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం దుద్దుకూరులో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దుద్దుకూరు గ్రామానికి చెందిన బిళ్లా ఇస్సాకు( 55 ) అనే కౌలు రైతు గత కొన్ని సంవత్సరాలుగా ఆరు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, మిరప పంటలు పండిస్తున్నాడు. అయితే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక, సరిగా పంటలు పండక సుమారు 22 లక్షల రూపాయలు అప్పుల పాలయ్యాడని మృతుడి బంధువులు తెలిపారు. ఈ ఏడాది పండించిన మిరప పంటకు తెగులు సోకటంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. నోటి వెంట నురుగు రావటంతో గమనించిన బంధువులు చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పులు తీర్చలేక.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక, సరిగా పంటలు పండక సుమారు 22 లక్షల రూపాయలు అప్పుల పాలయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలో జరిగింది.
farmer suicide attempt in duddukuru