తన సొంత ద్విచక్ర వాహనాన్నే ఓ వ్యక్తి పెట్రోలు పోసి తగలబెట్టిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం కట్టబడినవారిపాలెం సచివాలయం ఎదుట జరిగింది.
పొలాన్ని పాడు చేసిన పశువులు...కోపంతో కౌలు రైతు ఏం చేశాడంటే..! - దర్శి వార్తలు
ఆ రైతు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని పుచ్చ, దోస పంట వేశాడు. పంట సమృద్ధిగా పండింది. రోజూ పశువులు పంటను మేస్తుండడంతో పలుమార్లు యజమానులకు చెప్పి చూశాడు. వారు పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. వారు స్పందించి న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ.. గ్రామ సచివాలయం ఎదుట తన ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టాడు.
సచివాలయం ఎదుట పెట్రోల్ దహనం
గ్రామానికి చెందిన మాదాసు వెంకటేశ్వర్లు అనే రైతు ఆరు ఎకరాల్లో పంటను వేయగా.. పశువులు పొలాన్ని పాడు చేస్తున్నాయి. పశువుల యజమానులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో దర్శి పోలీసులను ఆశ్రయించాడు. వారు న్యాయం చేస్తామని చెప్పి అతణ్ని గ్రామానికి పంపారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు.. గ్రామ సచివాలయం ఎదుట తన ద్విచక్ర వాహనాన్ని పెట్రోలు పోసి నిప్పంటించాడు.