ప్రకాశం జిల్లా మార్టూరులోని శ్రీరామ్ చిట్స్‌లో చోరీకి విఫలయత్నం జరిగింది. కార్యాలయ కిటికీ పగలగొట్టి లోపలకు వెళ్లిన దుండగుడు... లాకర్ తెరిచే ప్రయత్నం చేశాడు. గునపంతో లాకర్ పగలగొట్టేందుకు యత్నించాడు. అయితే అవి తెరుచుకోలేదు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మార్టూరు శ్రీరామ్ చిట్స్‌లో చోరీకి విఫలయత్నం - theft in sriram chits latest news
చిట్‌ఫండ్ కార్యాలయంలో దొంగతనానికి ప్రయత్నించాడో యువకుడు. పలుగుతో లాకర్ తెరిచే ప్రయత్నం చేశాడు. కానీ లాకర్ తెరుచుకోలేదు సరికదా... అతను చేసిన ప్రయత్నమంతా సీసీ కెమెరాలో రికార్డైంది.
మార్టూరు శ్రీరామ్ చిట్స్‌లో చోరీకి విఫలయత్నం