ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్​ఐ ఫొటోతో ఫేస్​బుక్ ఖాతా.. డబ్బుల వసూళ్లలో ఇదో కొత్త దందా! - latest news of cyber crime in prakasam dst

ఫేస్‌బుక్‌లో ఎస్సై చిత్రాలను ప్రొఫైల్‌ పిక్స్‌గా పెట్టుకుని నయా దందాకు పాల్పడుతున్న ముఠా వ్యవహారం.. ప్రకాశం జిల్లా అద్దంకిలో వెలుగు చూసింది. ఫేస్​బుక్​లో ఎస్సై స్నేహితులతో సైబర్‌ నేరగాళ్లు చాటింగ్‌ చేయటం.. పరిచయం అయ్యాక డబ్బులు అడగటం వీరి నైజం.

facebook crimes in prakasam dst using police department
facebook crimes in prakasam dst using police department

By

Published : Sep 5, 2020, 4:41 PM IST

పోలీస్‌ శాఖనే వాడుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు

ప్రకాశం జిల్లాలో నేరగాళ్లు ఏకంగా పోలీసు శాఖనే వాడుకుంటున్నారు. అద్దంకిలో ఎస్సైగా చేస్తున్న మహేశ్‌ ఫొటోను పెట్టుకుని ఫేస్‌బుక్‌లో కొత్తగా ఖాతా తెరిచాడో దుండగుడు. అతని ఫేస్​బుక్​లో ఉన్న స్నేహితులతో మెసెంజెర్‌లో చాటింగ్‌ చేశాడు. పరిచయం పెరిగాక.... తనకు అత్యవసరంగా డబ్బులు అడిగేవాడని పోలీసులు తెలిపారు.

ఈ విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఎస్సై మహేశ్‌.... వారిని అప్రమత్తం చేశారు. అది తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కాదని నేస్తాలకు తెలియజేశాడు. అలాగే పోలీసులు విచారణ చేయగా.... నెల్లూరు జిల్లాలో మరో ఇద్దరు ఎస్సైల పేరుతో.... ఆ అపరిచిత వ్యక్తులు కొత్త రకం మోసం చేస్తున్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details