కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదవారికి తమ వంతు సాయం చేస్తూ పలువురు దాతృత్వం చాటుకుంటున్నారు.
500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో శాంతి సహాయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 500 కుటుంబాలకు కూరగాయల పంపిణీ జరిగింది. స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని కూరగాయలను ఆయా కుటుంబాలకు అందజేశారు.
500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ 4వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేత
కడప జిల్లా రాయచోటిలోని స్థానిక బీఎంఎస్ ట్రస్ట్ సభ్యులు 4వేల మంది ముస్లింలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఎస్పీ అన్బురాజన్ కలిసి వస్తువులను పేదలకు అందజేశారు. పట్టణంలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి దాతల సహకారంతో రోజూ 2500 మందికి అన్నదానం జరుగుతుందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను జిల్లా ఎస్పీ వివరించారు.
4వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేత వాలంటీర్లకు తోడుగా ల్యాబ్ టెక్నీషియన్
విశాఖ జిల్లా చిప్పాడ గ్రామంలో నివసిస్తున్న కందివలస చిట్టిబాబు తమ గ్రామ పరిధిలో పనిచేసే వాలంటీర్లకు మాస్కులు, శానీటైజర్లు పంపిణీ చేశారు. విశాఖ నగరంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి కరోనా వ్యాధి పట్ల సర్వేలు చేస్తున్న వాలంటీర్లకు ఎలాంటి వ్యాధులు సోకకుండా రక్షణగా మస్కులు, గ్లౌజులు, సానిటైజర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
వాలంటీర్లకు తోడుగా ల్యాబ్ టెక్నీషియన్ మా వంతు సహాయంగా
నెల్లూరు గొలగమూడి రోడ్డు ఇందిరమ్మ కాలనీలోని నిరుపేదలకు 'పవర్ యూత్ స్వచ్ఛంద సేవ' సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నెల్లూరు నగరంలో నిరుపేదలకు రోజూ తమ వంతు సహాయం చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.
ప్రకాశంలో పేదలకు అండగా
ప్రకాశం జిల్లా కనిగిరిలో రోజువారీ కూలీలకు స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నగర పంచాయతీలోని 12,13 వార్డుల్లో ఉన్నవారికి వాలంటీర్ల ద్వారా సరకులను అందజేశారు. జిల్లాలోని కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983-84లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు పేద కుటుంబాలకు నిత్యావసర సరకులను అందజేశారు. లాక్‌డౌన్‌తో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను దృష్టిలో ఉంచుకుని వారికి సరకులను పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు.
కాలినడకన వెళ్లి గిరిజనులకు నిత్యావసర వస్తువులు పంపిణీ
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో అటవీ ప్రాంతమైన సదాశివ కొనలో నివసించే గిరిజనులకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రధాన రహదారి నుంచి సుమారు 15కిమీ దట్టమైన అటవీ ప్రాంతంలో 220 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న వారి వద్దకు ఎద్దుల బండిపై కొంత దూరం... కాలినడక మరికొంత దూరం వెళ్లి ఎమ్మెల్యే వారికి సరకులు అందజేశారు.
కాలినడకన వెళ్లి గిరిజనులకు నిత్యావసర వస్తువులు పంపిణీ