ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెల్ల రేషన్​కార్డు దారులకు ఈ-కేవైసీ పాట్లు - prakasam

తెల్ల రేషన్ కార్డుదారులు ఈ - కేవైసీ చేయించుకొనేందుకు ఇబ్బందులు పడ్డారు. ప్రక్రియకు సోమవారం చివరి రోజు కారణంగా.. కార్డుదారులు పెద్దసంఖ్యలో చౌక దుకాణాలకు తరలివెళ్లారు.

కేవైసీ

By

Published : Aug 12, 2019, 11:27 PM IST

తెల్ల రేషన్ కార్డుదారులు ఈ - కేవైసీ ప్రక్రియలో తమ వివరాలు నమోదు చేయించుకునేందుకు.. ప్రభుత్వం ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. సంక్షేమ పథకాలు అందరికి అందాలంటే ఈ- కేవైసీ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసిన కారణంగా.. చాలామంది చౌకదుకాణాలముందు క్యూ కట్టారు. ఈ పాస్ యంత్రంలో వేలి ముద్రలు వేసిన తర్వాత.. సాంకేతిక సమస్యల కారణంగా ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ పరిణామంతో.. రేషన్ కార్డు దారులు ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు మొరాయించి.. పూర్తిగా ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. చివరికి.. కార్డుదారులు, డీలర్లు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. దర్శిలో 7చౌకదుకాణాలుండగా అన్నీచోట్ల ఇదే పరిస్ధితి నెలకొంది.

తెల్లరేషన్ కార్డు దారులకు ఈ- కేవైసి పాట్లు

ABOUT THE AUTHOR

...view details