కరోనాపై పోరులో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీలు, నగరపాలక సంస్థలు, పురపాలిక సంఘాల అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొన్నిచోట్ల దండోరాతో చాటింపు వేస్తున్నారు. 'ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా మన ఊరికి కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు ప్రజలందరూ రేపంతా ఇంట్లోనే ఉండాలహో.. జనతా కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరూ బయటకు రాకూడదహో...' అంటూ గ్రామాల్లో డప్పులతో దండోరా వేస్తున్నారు. జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ రెవెన్యూ అధికారులు ఇలా ప్రచారం నిర్వహిస్తున్నారు.
జనతా కర్ఫ్యూపై పల్లెల్లో దండోరా - కరోనాపై వినూత్న అవగాహన
జనతా కర్ఫ్యూపై రాష్ట్ర ప్రజలకు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. గతంలో మాదిరి దండోరాతో పల్లెల్లో చాటింపు వేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, టీవీలు ఉన్నప్పటికీ గ్రామాల్లోని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఈ విధానాన్ని ఎంచుకున్నారు.
dandora