ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తోన్న వర్షానికి సగిలేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గడిచిన ఆరు సంవత్సరాల్లో ఇదే మొదటిసారి సగిలేరుకు నీరు రావటమని గిద్దలూరు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి రావటం వలన గిద్దలూరులోని ప్రధాన సాగు, తాగునీటి సమస్యలు కొంతవరకైనా తీరుతాయని ప్రజలు, రైతులు ఆశిస్తున్నారు.
ఆరేళ్ల తరువాత హర్షం - heavy rain
ప్రకాశం జిల్లాలోని సగిలేరు వాగు నిండి ఆరేళ్లవుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షల కారణంగానే మళ్లీ ఇన్నాళ్లకు తమ వాగుకు నీరొస్తోందని రైతులు హర్షిస్తున్నారు.
వర్షం కారణంగా నిండిన సగిలేరు వాగు