ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకుల ముందు ఖాతాదారుల కష్టాలు

లాక్ డౌన్ కారణంగా బ్యాంకులు పనిచేసే సమయం తగ్గించారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసు రావటంతో అధికారులు 2 గంటలు మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంచుతున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ఖాతాదారులు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు.

due to decreasing  bank timings  croud increassing  at prakasam dst darshi banks
due to decreasing bank timings croud increassing at prakasam dst darshi banks

By

Published : May 22, 2020, 9:59 PM IST

ప్రకాశం జిల్లా దర్శిలో కరోనా పాజిటివ్ కేసు వచ్చిన నేపథ్యంలో పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. దర్శి పట్టణంలోని బ్యాంకులు ఉదయం10గంటల నుంచి 12 గంటల వరకు తెరుస్తున్నారు. కేవలం 2గంటలు మాత్రమే పనిచేస్తుండటంతో ఖాతాదారులు 9 గంటల నుంచే బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. కొన్ని బ్యాంకుల వద్ద ఖాతాదారులకు ఎండ నుంచి ఉపశమనం కలిగేందుకు పానియాలు... కరోనా బారిన పడకుండా శానిటైజర్లు ఏర్పాటు చేశారు.

దర్శిలోని ఆంధ్రాబ్యాంక్​లో మాత్రం ఏ విధమైన ఏర్పాట్లు చేయలేదు. ఎండలో నిలబడలేక అల్లాడిపోతున్నామని పసిపిల్లల తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బ్యాంకుల ముందు ఖాతాదారులు భౌతికదూరం సంగతే మరిచారు. బ్యాంకువారు ఖాతాదారులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండిహైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు'

ABOUT THE AUTHOR

...view details