ప్రకాశం జిల్లాలో జనాతా కర్ఫ్యూ విజయవంతంగా సాగుతోంది. ఉదయం 7 నుంచి ప్రజలు స్వఛ్చందంగా ఇంటి వద్దే ఉంటూ తమ వంతు సహకారిన్ని అందిస్తున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణంలో అన్ని ప్రధాన రహదారులూ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పరిస్థితిల్లో తప్పా ఎవరూ రోడ్లుమీదకు రాలేదు. వ్యాపార సంస్థలు మూసివేసారు. రవాణా వ్యవస్థను బంద్ చేశారు. దాదాపు 750 బస్సులు డిపోలకే పరిమితమయ్యారు. దుకాణాలు, హోటళ్ళు, షాపింగ్ మాల్స్, సినిమాహాళ్ళు, ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.
ఒంగోలులో జనతా కర్ఫ్యూ.. ప్రజలు మద్దతు - ఒంగోలులో జనతా కర్ఫ్యూ
ఒంగోలులో నిత్యం ట్రాఫిక్‌తో కిటకిటలాడే ఆర్టీసి బస్టాండ్, నెల్లూరు రోడ్డు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇంటివద్దకే పరిమితమయ్యారు. జనతా కర్ఫ్యూకి జనమంతా మద్దతునిచ్చారు.
due to corona Janata curfew continues at ongole in prakasham district