ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాతుల గుంపు... కనులకు ఇంపు..!

ప్రకాశం జిల్లా అద్దంకిలో రెండు వేలకు పైగా బాతులు గుంపు రోడ్డు పై వెళుతూ....వాహనదారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో...వాటి దాహార్తిని తీర్చుకోవటానికి అద్దంకి బ్రాంచ్ కెనాల్​లో ఈత కొడుతూ సేదతీరాయి.

ducks walking in andaniki
బాతులు గుంపు...కనులకు ఇంపు

By

Published : Feb 7, 2020, 6:04 PM IST

రహదారిపై బాతుల గుంపు

బాతులకు సరైన ఆహారం దొరక్క పోవటం వల్ల సుదూర ప్రాంతాల నుంచి బాతుల పెంపకం దారులు ప్రకాశం జిల్లా అద్దంకి పరిసర ప్రాంతాలకు వలస వచ్చారు. అద్దంకి ప్రాంతంలో వరి పంట నూర్పిడి పనులు జరుగుతుండటంతో బాతులకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. రైతులు సైతం తమ పొలాల్లోకి బాతులను ఆహ్వానిస్తున్నారు. పంట పొలాల్లో ఉన్నటు వంటి క్రిమిసంహారక పురుగులను తినడం సహా పంటలను పరోక్షంగా రక్షిస్తున్నాయి. ఒక పొలం నుంచి మరో పొలానికి రెండు వేలకు పైగా బాతుల గుంపు రహదారిపై వెళ్తున్న దృశ్యాలు చూపరులను కట్టిపడేశాయి. క్రమశిక్షణకు మారుపేరు మేమే అన్నట్లుగా బాతులు ఒక వరుసలో నడుస్తూ వాహనదారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. అద్దంకి బ్రాంచ్ కెనాల్​లో నీరు ఉండటంతో బాతులు వేసవి తాపం తీర్చుకునేందుకు నీటిలో దూకుతూ సందడి చేశాయి.

ABOUT THE AUTHOR

...view details