Passenger Car Seized for CM Convoy in Ongole: ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణికుల కారును స్వాధీనం చేసుకున్న ఘటనపై డ్రైవర్ సునీల్ కుమార్ మరిన్ని వివరాలు అందించారు. వేమూరు శ్రీనివాస్ అనే అతను.. వినుకొండ నుంచి తిరుపతి వెళ్లేందుకు ట్రావెలర్స్ కారును అద్దెకు తీసుకున్నారు. తిరుపతి వెళ్లుండగా ఒంగోలులో టిఫిన్ చేయడానికి ఆగాము. ఇంతలో ఇద్దరు అధికారులు వచ్చి కారు కాగితాలు అడిగారు. అందులో ఓ మహిళా అధికారి ఆ పత్రాలను తీసుకెళ్లారు. కానిస్టేబుల్.. కారును సీజ్ చేస్తున్నని చెప్పి తీసుకెళ్లారు. శుక్రవారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సీఎం కాన్వాయికి వాహనం పెట్టాలని అడగ్గా.. నేను నిరాకరించాను. నీ వాహనానికి ఫిట్నెస్ కాలపరిమితి ముగిసింది.. కేసు రాస్తే పలుమార్లు తిరగాల్సి వస్తుందని కానిస్టేబుల్ చెప్పారు. దీంతో భయపడి కారును అధికారులకు అప్పగించాను. కాన్వాయ్‌గా పెట్టినందుకు రూ. 2వేలు ఇచ్చారు. వినుకొండ నుంచి మరో కారు తెప్పించి ప్రయాణీకులను తిరుపతికి పంపించాను. నేను ఆ రాత్రే వినుకొండకు వెళ్లిపోయాను. ఉదయాన్నే అధికారుల ఫోన్ చేయడంతో మళ్లి ఒంగోలు వచ్చాను.
అలా చేస్తామని భయపెట్టడంతో కారును అప్పగించా: డ్రైవర్ - Passenger Car Seized for CM Convoy in Ongole
Driver on Passenger Car Seized in Ongole: సీఎం కాన్వాయ్కి ప్రయాణీకుల కారును స్వాధీనం ఘటనపై డ్రైవర్ సునీల్ కుమార్ మరింత సమచాచారం ఇచ్చారు. ఒంగోలులో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. కారుకు ఫిట్నెస్ లేదు.. కేసు రాస్తామనడంతో భయపడి తన కారును సీఎం కాన్వాయ్కి అప్పగించినట్లు చెప్పారు.
Driver Comments on Passenger Car Seized in Ongole