Handicapped pension: వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చే పింఛనును ఇంటి పన్నుకు జమ చేస్తున్నారంటూ.. వారు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం ధర్మవరంలో వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శి వికలాంగులతో వేలిముద్రలు వేయించుకొని పింఛను నగదు చెల్లించకుండా.. ఇంటి పన్నుకు జమ చేసుకుంటున్నారు. ఆ పన్ను రసీదు కూడా తమకు ఇవ్వలేదని, అదేమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ దురుసుగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల వికలాంగుల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, మరికొందరు బాధిత వికలాంగులు గురువారం ఎంపీడీవో కరీముల్లాకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి తమకు పింఛను నగదు చెల్లించేలా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శితో మాట్లాడతామని తెలిపారు.
Handicapped Pension: వాలంటీర్ల నిర్వాకం.. వికలాంగుల పింఛను ఇంటి పన్నుకు జమ - ap latest news
Handicapped pension: వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చే పింఛనును ఇంటి పన్నుకు జమ చేస్తున్నారంటూ.. వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం ధర్మవరంలో వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శి వికలాంగులతో వేలిముద్రలు వేయించుకొని పింఛను నగదు చెల్లించకుండా.. ఇంటి పన్నుకు జమ చేసుకుంటున్నారని వాపోయారు.
వికలాంగుల పింఛను ఇంటి పన్నుకు జమ
TAGGED:
ap latest news