ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం పుల్లలచెరువు గ్రామంలోని రంగనాయకస్వామి ఆలయ ఆవరణలో గల రంగస్వామిగుండానికి.. పెద్దఎత్తున భక్తులు తరలుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వరద పెరిగి కొండల మీద నుంచి జాలువారుతోంది. ఈ జలధార దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. అంతేగాక ఆరు నెలలుగా వర్షం లేక ఇబ్బందిపడుతున్న అన్నదాతలకు ఈ వర్షం రాక ఉపశమనం ఇచ్చింది.
వర్షంతో రంగస్వామి గుండం జలపాతం పరవళ్లు - పుల్లలచెరువు గ్రామం
ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు.. రంగస్వామిగుండం జలకళను సంతరించుకుంది. అక్కడి జలధారను చూడటానికి పర్యాటకులు తరలివెళ్తున్నారు.
devoties want to see waterflow of rangaswamy gundam at prakasham district