పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు ఓటు వేయకుంటే ప్రభుత్వ పథకాలను నిలిపి వేస్తామనీ కొందరు వాలంటీర్లు ఓటర్లను బెదిరించారని ఆరోపిస్తూ.. ప్రకాశం జిల్లా పామూరు మండలంలో ఓడిన సర్పంచి, వార్డు అభ్యర్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణ అధికారిగా స్థానిక తహసీల్దార్‌ను నియమించారు.
విచారణకు రాకుండా అడ్డగింత..
విచారణ నిమిత్తం ఫిర్యాదు చేసిన వారిని, వాలంటీర్లను తహసీల్దారు కార్యాలయానికి రావాలని ఆదేశించారు. వాలంటీర్లు, ఫిర్యాదుదారులు, తెదేపా నాయకులు తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. అంతలోనే కొందరు వైకాపా నాయకులు అక్కడికి చేరుకొని వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.