అవసరం కోసం ప్రయాణించే వారు కొందరైతే... బతుకుదెరువు కోసం వ్యవసాయ పనులకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు మరికొందరు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పనుల్లేక... ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు కూలీలు ఆటోల్లో ఎక్కి... ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణిస్తే... ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేకనే ఆటోల్లో ఇలా వెళ్తున్నామని చెబుతున్నారు.
పరిమితికి మించి ప్రయాణం... కారాదు ప్రమాదం - prakasham district
గ్రామీణ ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణిస్తూ... ప్రమాదాలకు గురవుతున్నారు.
పరిమితికి మించిన ప్రయాణం....కారాదు ప్రమాదం....