ప్రకాశం జిల్లాలో తొలివిడతగా 25వేల మంది వైద్యులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు కొవిడ్ టీకా వేయనున్నారు. ఇందులో భాగంగా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం.. తొలివిడతగా 31 వేల డోసులు వ్యాక్సిన్ ఒంగోలుకు చేర్చారు. వ్యాక్సిన్ను జిల్లా వ్యాధి నిరోధక కేంద్రంలో భద్రపరిచారు. టీకా భద్రపరిచిన కేంద్రంలో నిరంతరం పరిశీలనలో భాగంగా ఇప్పటికే సీసీటీవీ కెమెరాలు.. విద్యుత్ అంతరాయం రాకుండా జనరేటర్లను ఏర్పాటు చేశారు.
తొలివిడతగా జిల్లాలో 31 వేల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు.. - వాక్సిన్ పంపిణీ తాజా సమాచారం
ప్రకాశం జిల్లాలో మొదటగా వైద్య సిబ్బంది, అంగన్వాడీలకు కొవిడ్ టీకాను వేయనున్నారు. ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న టీకా పంపిణీలో భాగంగా.. తొలివిడతగా జిల్లాకు చేర్చిన 31 వేల డోసుల వ్యాక్సిన్ను ఒంగోలులోని వ్యాధి నిరోధక కేంద్రంలో భద్రపరిచారు. వ్యాక్సిన్ను అధికారులు పరిశీలించారు.
ప్రకాశం జిల్లాలో కొవిడ్ టీకా
వాక్సిన్ కేంద్రాల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఈనెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ జరగనుండగా.. రెండు మార్గాల్లో జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ తరలించడానికి రెండు వ్యానులను సిద్ధంగా ఉంచారు. బుధవారం ఉదయం జిల్లాకు చేరుకున్న వ్యాక్సిన్ను అధికారులు పరిశీలించారు. వాటిని అక్కడ ముందుగానే సిద్ధం చేసిన రెండు రిఫ్రిజిరేటర్లలో భద్రపరిచారు.