తన మేనల్లుడు కరోనాతో మృతి చెందాడని... తాము స్వచ్ఛందంగా ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు పరీక్షల కోసం వెళ్తే తనకు, తన భార్యకు పాజిటివ్ వచ్చిందని ఓ వ్యక్తి తెలిపాడు. వైద్యశాలలో వసతులు దారుణంగా ఉన్నాయంటూ... సెల్ఫీ వీడియోను తీసి బాధితుడు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. కనీసం బెడ్లు కూడా లేవని వాపోయాడు. ఎవరైనా ఈ వైద్యశాలకు వస్తే నరకంగా అనుభవిస్తారని.. పొరపాటున కూడా ఇక్కడకు రావొద్దని ఆవేదన వ్యక్తం చేశాడు. తాళాలు వేసి బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాళాలు వేసి బంధిస్తున్నారు... నరకం చూపిస్తున్నారు
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తాము స్వచ్ఛందంగా కరోనా పరీక్షల కోసం వెళ్తే... తనకు, తన భార్యకు పాజిటివ్ వచ్చిందని ఓ వ్యక్తి తెలిపాడు. వైద్యశాలలో వసతులు దారుణంగా ఉన్నాయంటూ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
వైద్యశాలలో వసతులు దారుణంగా ఉన్నాయంటూ బాధితుని సెల్పీ వీడియో