కరోనా నిబంధనలు పాటిస్తూ ఉపాధి హామీ పనులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఎక్కడా నియమాలు పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రకాశం జిల్లా దర్శి మండలం జముకులదిన్నె గ్రామంలో కూలీలెవరూ మాస్కులు ధరించటం లేదు. భౌతిక దూరం పాటించటం లేదు.
ఉపాధి సరే...కరోనా నిబంధనల మాటేంటి ? - ఉపాధి సరే...కరోనా నిబంధనల మాటేంటి ?
ప్రకాశం జిల్లా జముకులదిన్నె గ్రామంలో ఉపాధి కూలీలు కరోనా నిబంధనలు పాటించటం లేదు. భౌతికదూరం, మాస్కులు ధరించకుండా పనులకు హాజరువుతున్నారు.
ఉపాధి సరే...కరోనా నిబంధనల మాటేంటి ?
క్షేతస్థాయి సహాయకులు కూలీలకు అవహగాన కల్పించాల్సిన అవసరం ఉన్నా...అలా జరగటం లేదు. దీంతో కూలీలు వైరస్ బారిన పడే అవకాశం ఉంది. సెలువు దినాలు కావటంతో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పనులకు హాజరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి కూలీలకు కరోనా నిబంధలనపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.