ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్య సిబ్బందికి కరోనా... ఓపీ సేవలు నిలిపివేత - కడప కొవిడ్ వార్తలు

రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలవరపెడుతోంది. ఆపద సమయంలో ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవలు అందించే నర్సులతో పాటు ఆసుపత్రి ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచే పలువురు పారిశుద్ధ్య కార్మికులను సైతం కరోనా సోకింది.

Corona for medical staff in Kadapa
వైద్య సిబ్బందికి కరోనా

By

Published : Aug 21, 2020, 1:01 PM IST


రోగులకు వైద్య సేవలు అందించే వైద్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు వైద్య అధికారులు ప్రకటించారు. కడప జిల్లా రాజంపేట వైద్యవిధాన పరిషత్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న 11మంది నర్సులు, పారిశుద్ధ్య కార్మికులకు కరోనా నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్, సీహెచ్ సీ వైద్యాధికారి వెంగల్ రెడ్డి తెలిపారు.

గడిచిన 48 గంటల్లో ఏడుగురు వైద్య సిబ్బందికి కరోనా రావడంతో.. వారం రోజుల పాటు ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనిల్‌ తెలిపారు. ఆసుపత్రి ఆవరణలోని ప్రతి గదిని శుభ్రం చేయడంతో పాటు శానిటైజ్‌ చేయడం తప్పనిసరి అన్నారు. కరోనా సేవలు మినహా మిగిలిన సాధారణ సేవలను ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల అనుమతితో వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details