ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో ఒక్కరోజే 17 కరోనా పాజిటివ్ కేసులు - చీరాలలో కరోనా కేసుల వార్తలు

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో శుక్రవారం 17 కేసులు నమోదయ్యాయి. పట్టణంలో పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు అనవసరంగా బయట తిరగకుండా చూస్తున్నారు.

corona cases in chirala prakasam district
చీరాలలో కరోనా కేసులు

By

Published : Jul 4, 2020, 12:10 PM IST

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. శుక్రవారం ఒక్కరోజు 17 కేసులు నమోదయ్యాయి. చీరాల పట్టణంలో 12, వేటపాలెంలో 5 కేసులు వచ్చాయి.

ఉదయం 6 గంటల నుంచి 9 వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో జనం ఆయా షాపుల ముందు క్యూ కడుతున్నారు. నిత్యావసరాలు, మందుల కోసం వరుస కడుతున్నారు. చాలా ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో ఉండటంతో పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి పట్టణంలో పర్యటిస్తూ పోలీసులకు, ప్రజలకు తగిన సూచనలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details