వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులు వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా డోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులను కలెక్టర్ పరిశీలించారు.
'వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులను వేగంగా పూర్తి చేయాలి' - ప్రకాశం జిల్లా వార్తలు
పకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
'వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నేల్ పనులను వేగంగా పూర్తి చేయాలి'
వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ పనులు పూర్తి చేయడానికి.. 5 ప్రాంతాల్లో పనులు చేపట్టడానికి ప్రణాళికలు తయారు చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పునరావాస కేంద్రాలకు తీసుక వెళ్లటానికి చర్యలు చేపట్టామన్నారు.
ఇదీ చదవండి'సీఎం జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం'