ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చినపోలిరెడ్డి ఎత్తిపోతల విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం యర్రం చినపోలి రెడ్డి ఎత్తిపోతల పథకం కింద వేలాది ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. కొరిసపాడు మండలంలో యర్రం చినపోలి రెడ్డి ఎత్తిపోతల పథకం విస్తరణ పనులను ఆయన పరిశీలించారు.

చినపోలిరెడ్డి ఎత్తిపోతల విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్
చినపోలిరెడ్డి ఎత్తిపోతల విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్

By

Published : Feb 7, 2021, 10:10 AM IST

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలంలో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం విస్తరణ పనులను కలెక్టర్ పోల భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి కొరిసపాడు పరివాహక ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి అధికారులంతా సహకరించాలని కోరారు. యర్రం చినపోలి రెడ్డి ఎత్తిపోతల పథకం కింద గతంలో నిర్మించిన చెరువు కేవలం 120 ఎకరాల విస్తీర్ణంలో వుండగా దాని సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు చెప్పారు.

750 ఎకరాల్లో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందన్న ఆయన.. ప్రాజెక్టు కింద రెండు ఫీడర్ కెనాల్స్ నిర్మించినట్లు తెలిపారు. ఒక కెనాల్ నుంచి 10,200 ఎకరాలు సాగులోకి వస్తాయని.. మరో ఫీడర్ కెనాల్ నుంచి 9,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన చెప్పారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు.

ఇదీ చదవండి: బీటెక్ విద్యార్థిని మృతి కలచివేసింది: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details